- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీతో చేతులు కలిపేద్దాం.. సీఎంకు ఎమ్మెల్యే లేఖ
ముంబై: ‘కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ‘లు వెంటపడుతున్నాయి. కుటుంబ సభ్యులనూ వేధిస్తున్నాయి. శివసేన నేతలు, ఎమ్మెల్యేలను వీటి నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపేద్దాం. ముందున్న ముంబై, థానే సహా పలు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కలిసొస్తుంది’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్ లేఖ రాశారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పొసగక కాంగ్రెస్, ఎన్‌సీపీతో శివసేన జట్టుకట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
సీఎం పీఠంపై బీజేపీ, శివసేనల మధ్య పేచీ కారణంగా మాజీ మిత్రపక్షాలు బీజేపీ, శివసేనలు వేరుపడ్డాయి. పలు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తన వెంటపడి వేధిస్తున్నాయని, తనతోపాటు అనిల్ పరాబ్, రవీంద్ర వాయికర్‌లాంటి శివసేన నేతలనూ వేధిస్తున్నాయని ఆ లేఖలో ప్రతాప్ ప్రస్తావించారు. ఒకవేళ శివసేన బీజేపీతో కలిస్తే ఈ వేధింపుల నుంచి రక్షణ పొందుతారని అభిప్రాయపడ్డారు. ఓ మనీలాండరింగ్ కేసులో ప్రతాప్ ఆస్తులపై గతేడాది ఈడీ చాలాసార్లు దాడులు చేసింది. తన కొడుకు విహంగ్‌నూ ఏజెన్సీ విచారించింది.