శిల్పా శెట్టి తల్లి చీటింగ్ కేసు..

by Shyam |   ( Updated:2021-07-29 04:28:37.0  )
శిల్పా శెట్టి తల్లి చీటింగ్ కేసు..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసుతో ఇప్పటికే వార్తల్లో నిలుస్తుండగా.. తాజాగా మరోసారి హెడ్ లైన్స్ టచ్ చేసింది. శిల్పా శెట్టి తల్లి సునందా శెట్టి చీటింగ్ కేసు నమోదు చేయడంతో మరోసారి బజ్ క్రియేట్ అయింది. సుధాకర్ ఘరే అనే వ్యక్తి ఫేక్ పేపర్స్ ద్వారా ల్యాండ్ అమ్మి రూ.1.6 కోట్ల వరకు మోసం చేశాడని ఆరోపిస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు ప్రస్తుతం రాజ్ కుంద్రా జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. తనతో పాటు భర్తకు కూడా ఈ కేసుతో సంబంధం లేదని శిల్పా శెట్టి చెబుతోంది. కానీ అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేశాకే శిల్పాకు క్లీన్ చీట్ ఇస్తామని, ఫోరెన్సిక్ ఆడిటర్స్ అన్ని ఎకౌంట్స్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read more: వద్దంటున్న ముద్దు పెట్టాడు.. రాజ్ కుంద్రాపై నటి ఆరోపణలు

Advertisement

Next Story