- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి పోలిక.. ఫిట్ నెస్ పై శిల్పా కొడుకు కాన్సంట్రేషన్
పిల్లలు మనం చేస్తున్న పనులను అనుకరిస్తారని చెప్తోంది చేప కళ్ల సుందరి శిల్పా శెట్టి. తను వ్యాయామం, యోగా సాధన చేయడం చూసి.. కొడుకు వియాన్ కూడా ఆరోగ్యం, ఫిట్ నెస్ పై ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టాడని చెప్తోంది. పిల్లలు చాలా శక్తిని కలిగి ఉంటారని.. ఆ శక్తిని సరైన క్రమంలో వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. వియాన్ జిమ్నాస్టిక్స్ పట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పిన శిల్పా.. అతన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పింది. కానీ ప్రాక్టీస్ లేకుండా జిమ్నాస్టిక్స్ తుప్పు పట్టేలా చేస్తుంది అంటున్న భామ.. రోజూ సాధన చేసేలా పిల్లలకు సూచించాలని కోరింది. ఇది బిడ్డల్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు. ప్రాక్టీస్ అనేది పిల్లల్ని పరిపూర్ణం చేస్తుందని .. ఆకలిని కలిగించడంతో పాటు చిన్నారులు హాయిగా నిద్రపోయేలా చేస్తుందని చెప్తోంది శిల్పా. వియాన్ జిమ్నాస్టిక్స్ వీడియోను కూడా షేర్ చేసింది.
https://www.instagram.com/p/CAUUtkmhfNq/?utm_source=ig_web_copy_link
కాగా శిల్పా లాక్ డౌన్ పీరియడ్ లో తన వీడియోస్ తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. భర్త రాజ్ కుంద్ర, కొడుకు వియాన్ తో కలిసి డిఫరెంట్ వీడియోస్ చేస్తూ షేర్ చేస్తోంది. వీటిలో మోడర్న్ మహాభారతం వీడియో బాగా ఆకట్టుకుంది. ఇక కూతురు షమిషా ప్రత్యేకం అని చెప్పిన శిల్పా… పాప మొహం ఇంకా చూపించనే లేదు. చిన్నారి మొదటి పుట్టినరోజున ఆ అదృష్టం కలిగిస్తుందట.