యోగాతో పాటు ప్రకృతిని ఆస్వాదించండి : శిల్ప

దిశ, వెబ్‌డెస్క్: ఫిట్ బ్యూటీ శిల్పాశెట్టి యోగాను ఆస్వాదించమని చెబుతోంది. ఉదయం చల్లని గాలితో ప్రారంభమైన ఈ రోజు చాలా అద్భుతంగా ఉందని చెప్పిన శిల్ప.. మన జీవితంలో కొంచెం టైమ్ తీసుకుని యోగాతో పాటు ప్రకృతి, పరిసరాలు, మన అంతరంగంతో కనెక్ట్ కావాలని సూచిస్తోంది. యోగా ప్రశాంతతో పాటు సానుకూలత కలిగించే శక్తిని ఇస్తుందని తెలిపింది. తనకు ఇలాంటి టైమ్ దొరికినందుకు ఆనందంగా ఉన్నానని చెప్పింది.

https://www.instagram.com/tv/CEi0FfxhhjG/?igshid=nhmj3edhlnsu

ఉత్కటాసన ప్రాక్టీస్ చేసిన శిల్ప.. ఇందువల్ల కలిగే లాభాలను వివరించింది. ఆసనాలు శరీరాన్ని బలోపేతం చేయడం మాత్రమే కాదు.. ఫోకస్ పెంచుతాయని చెప్పింది. ప్రతీ ఒక్కరు ఆసనాల ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని.. ప్రతీరోజు యోగా చేయాలని కోరింది. ఓనం పండుగ పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన శిల్ప.. అందరికీ శుభం కలగాలని కోరుకుంది.

Advertisement