- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: శిల్పా చౌదరి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: కిట్టి పార్టీల పేరుతో ప్రముఖులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసముంటోన్న ఆమెను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బాధిత ప్రముఖలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నా కొద్ది పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. తాజాగా.. ఆమె ప్రముఖుల వద్ద నుంచి తీసుకున్న కోట్ల రూపాయల డబ్బును ఎక్కడికి తరలించిందన్న కోణంలో శుక్రవారం విచారణ జరుపుతోన్న నార్సింగి పోలీసులు, శిల్పా చౌదరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
అంతేగాకుండా.. శిల్పా చౌదరి కాల్‌డేటాలోని కొంతమందికి పోలీసులు ఫోన్ చేసి సంప్రదించారు. ఆమె స్టేట్‌మెంట్ వివరాల ప్రకారం.. ‘‘తనకు డబ్బు ఇచ్చిన వారు చాలామంది అప్పుగా ఇచ్చారు. మరి కొంతమంది బ్లాక్ మనీని ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా వైట్‌గా మార్చేందుకు ఇచ్చారు.’’ అని శిల్పా చౌదరి చెప్పుకొచ్చారు. కాగా, శుక్రవారం శిల్పా చౌదరి మొదటిరోజు కస్టడీ విచారణలో పోలీసులు ఎదుట శిల్పా చౌదరి బోరున విలపించింది. విచారణ అనంతరం ఆమె బ్యాంక్ స్టేట్‌మెంట్లపై పోలీసులు ఆరా తీశారు.