- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీకి సీనియర్ నటుడి సపోర్ట్.. కౌంటర్ ఇచ్చిన హీరో
దిశ, సినిమా : బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ట్వీట్ వార్ జరిగింది. దర్శకుడు శేఖర్ గుప్తా కేంద్ర ప్రభుత్వ పాలనపై విమర్శిస్తూ ట్వీట్ చేయగా దీనిపై అనుపమ్ ఖేర్ స్పందించిన తీరుపై కౌంటరిచ్చాడు సిద్ధా్ర్థ్. ప్రస్తుతం ఈ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1960లలో పుట్టిన శేఖర్ గుప్తా.. మూడు వరల్డ్ వార్స్, ఆహారకొరత, విపత్తులు చాలా చూశానని, కరోనా అతిపెద్ద సంక్షోభంగా కనిపిస్తుందని ట్వీట్ చేశాడు. ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చేందుకు.. కనీసం కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయలేదని, ఇలాంటి విపత్కర సమయంలో జవాబుదారిగా లేదని విమర్శించాడు. దీనిపై స్పందించిన నటుడు అనుపమ్ ఖేర్ మీరు అర్హతకు మించి మాట్లాడుతున్నారని, కొంచెం ఎక్కువైందని ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. కరోనా ఒక విపత్తు.. ప్రపంచమంతా ఉంది. ఇంతకుముందు ఇలాంటి అంటు వ్యాధిని దేశం ఎదుర్కోలేదు, కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోమని బాధ్యతాయుతంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చాడు. ‘మళ్లీ మోడీనే వస్తాడు.. జయహో’ అంటూ ట్వీట్ చేశాడు.
https://twitter.com/AnupamPKher/status/1386341651837194242?s=20
ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన సిద్ధార్థ్ కౌంటర్ ఇచ్చాడు. ‘మళ్లీ మోడీ వస్తాడు అనుకునే బదులు.. కొవిడ్ పోతుంది అనుకుంటే ఉత్తమం’ అన్నాడు. కరోనా వస్తే మోడీ ఉన్నాడని అంటున్నారు కానీ కొవిడ్ వల్ల ఓ మనిషి పోతే దానికి బాధ్యుడు మోడీ కాదా అని ప్రశ్నించాడు. ‘రంగ్ దే బసంతి’లో అనుపమ్, సిద్ధార్థ్ తండ్రీకొడుకులుగా నటించగా.. సినిమాలో అనుపమ్‌ను సిద్ధార్థ్ ఎందుకు చంపాడో ఇప్పుడు అర్థమవుతుందని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.