వన్ మోర్ ఫ్రమ్ ‘రసోడే మే కౌన్ థా?’

by Shyam |
వన్ మోర్ ఫ్రమ్ ‘రసోడే మే కౌన్ థా?’
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మ్యూజిక్ డైరెక్టర్ యశ్‌రాజ్ ముఖటే మరో అదిరిపోయే వీడియో రిలీజ్ చేశాడు. ‘రసోడే మే కౌన్ థా? మ్యూజిక్‌ వీడియో ద్వారా పాపులర్ అయిన ఆయన.. ఈ సారి సీరియల్‌ డైలాగ్ కాకుండా హిందీ బిగ్ బాస్ సీజన్ 13 కంటెస్టెంట్ షెహ్నాజ్ గిల్‌ను ఎంచుకున్నాడు. కోపంలో ఎలా పడితే అలా మాట్లాడేసే షెహ్నాజ్ క్యూట్ వర్డ్స్‌కు మ్యూజిక్ మ్యాజిక్ యాడ్ చేసి వీడియో షేర్ చేశాడు. పంజాబ్‌లో ఇంగ్లీష్, హిందీ, మరాఠి లాంటి అన్ని భాషలను మిక్స్ చేసి తిట్టేసే పాప్ సింగర్ పంజాబీ ఫ్రేజ్‌ను ఫన్నీ వేలో ప్రజెంట్ చేశాడు. అంతేకాదు ఈ వీడియోలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ కూడా షెహ్నాజ్ మాటలకు డోల్ వాయిస్తుండగా.. సూపర్ ఫన్నీగా ఉన్న వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోకు అప్‌లోడ్ చేసిన కొద్దిగంటల్లోనే దాదాపు లక్షా 80వేల లైక్స్ రావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed