- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు

X
దిశ,వెబ్‌డెస్క్: మాజీ ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. శశికళ నాలుగేండ్ల జైలు శిక్ష 27తో ముగియనున్నట్టు ఆమె తరఫు న్యాయవాది రాజు సేతు పాండియన్ తెలిపారు. అయితే ఆమె మళ్లీ అన్నాడీఎంకేలోకి రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ వార్తలను సీఎం పళనీ స్వామి తోసిపుచ్చారు. అలాంటి అవకాశమే లేదని ఆయన అన్నారు. వంద శాతం ఆమెను పార్టీలో చేర్చుకోబోమని తేల్చిచెప్పారు. ఆమెను పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించామని తెలిపారు.
Next Story