స్పీడు పెంచిన శర్వానంద్ @30 కంప్లీట్

by Shyam |
స్పీడు పెంచిన శర్వానంద్ @30 కంప్లీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ హీరో శర్వానంద్ స్పీడ్ పెంచేశాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారాడు. ఈ క్రమంలో శ్రీ కార్తీక్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తన 30వ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేశాడు. ఈ సినిమాలో రితు వర్మ హీరోయిన్ కాగా.. అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా జేక్స్ బెజాయ్, సినిమాటోగ్రాఫర్‌గా సుజిత్ సారంగ్ పని చేశారు.

https://twitter.com/ImSharwanand/status/1331102906167136257?s=19

ఈ సినిమాతో పాటు కిషోర్ బి డైరెక్షన్‌లో వస్తున్న ‘శ్రీకారం’, అజయ్ భూపతి ‘మహాసముద్రం’, కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలు చేస్తున్న శర్వా.. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఫుల్ బిజీగా ఉండనున్నారు. కాగా శ్రీకారం నుంచి రిలీజైన ‘భలేగుంది బాలా’ సాంగ్ యూట్యూబ్ లో 5 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం.

Advertisement

Next Story