- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ సమస్యపై బాద్‌షా సినిమా
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను అభిమానులు చాలా మిస్ అవుతున్నారు. ఆ నాటీనెస్, ఇన్నోసెన్స్, రొమాన్స్‌ను తెరపై చూసి రెండేళ్లు కావస్తుండగా.. తమ ఫేవరెట్ హీరోను ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూస్తామా? అని ఎదురుచూస్తున్నారు. చివరగా 2018లో జీరో సినిమాతో అలరించిన షారుఖ్.. సినిమా తీయడం పక్కన పెడితే.. కనీసం సినిమా గురించి కూడా ప్రకటించలేదు.
అయితే తొలిసారిగా దర్శకులు రాజ్ కుమార్ హిరానీతో షారుఖ్ పనిచేయబోతున్నారని.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని బాలీవుడ్ టాక్. వలస జీవితాల సమస్యల చుట్టూ తిరిగే కథలో షారుఖ్ ఇమ్మిగ్రేషన్ వర్కర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన షారుఖ్, కెనడాకు వెళ్లగా అక్కడ ఎదురయ్యే పరిస్థితులు, ఇబ్బందుల గురించి సినిమా ఉండబోతుండగా.. పంజాబ్, కెనడాలో చిత్రీకరణ జరగనుందని సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులు సాధారణమై ప్రయాణ నిబంధనలు సడలించగానే మూవీ యూనిట్ కెనడా వెళ్తుందని తెలుస్తోంది.
ఇక రాజ్ కుమార్ హిరానీ.. గత చిత్రాల మాదిరిగానే, ఈ సినిమాలోనూ తీవ్రమైన ప్రపంచవ్యాప్త సమస్యను సున్నితమైన హాస్యంతో ప్రెజెంట్ చేయబోతున్నారని టాక్. షారుఖ్ ఈ సినిమాలో నవ్విస్తూనే ఉద్వేగానికి గురిచేస్తాడని.. ఈ చిత్రం కోసమే జుట్టు కూడా పెంచుతున్నాడని మూవీ యూనిట్‌కు చెందిన వ్యక్తులు తెలిపారు. కెనడాలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి వస్తుందని.. అందుకే అనుమతుల కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు.