బాత్రూమ్‌లో షారుఖ్ ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా?

by Anukaran |
బాత్రూమ్‌లో షారుఖ్ ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ట్విట్టర్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. AskMe సెషన్‌లో అభిమానులడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్‌కు తనదైన స్టైల్‌లో ఫన్నీ అండ్ యూనిక్ రిప్లై ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఫ్యాన్! షారుఖ్‌ను గౌరీ లవ్ చేసేందుకు గల కారణాలు అడగ్గా.. ‘కుకింగ్, క్లీనింగ్, పిల్లలను చూసుకోవడంతో పాటు తను హ్యాండ్‌సమ్‌గా కనిపించడం అయుండొచ్చు’ అని సమాధానమిచ్చాడు. ఇక టీనేజ్ గర్ల్స్ అందంగా కనిపించేందుకు అడ్వైజ్ అడిగిన లేడీ ఫ్యాన్‌కు.. ‘అమ్మాయిలందరూ అందంగా ఉంటారు. ఒకరి అందాన్ని మరొకరితో పోల్చకూడదు. కానీ గుర్తుంచుకో.. యూ ఆర్ యూనిక్’ అని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇక గర్ల్స్‌ను పటాయించేందుకు సలహా అడిగిన అభిమానికి సూపర్బ్ రిప్లై ఇచ్చాడు షారుఖ్. ముందుగా పటాయించడం మానేసి.. సిన్సియర్‌గా ట్రై చేయమని సూచించాడు.

ఇక షారుఖ్ బాత్రూమ్‌లో ఎందుకు ఎక్కువ సమయం గడుపుతాడని అడిగన నెటిజన్‌కు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు ఫారుఖ్. ‘మీ పరిశోధనాత్మకతతో పాటు ఒక విషయాన్ని కనుక్కునేందుకు పడే ఆరాటం చూస్తుంటే ముచ్చటేస్తుంది.. ఖచ్చితంగా వీడియో సెండ్ చేస్తా’ అని హామీ ఇచ్చాడు.

Advertisement

Next Story