అక్షయ్‌పై విమర్శలొద్దు..

by  |
అక్షయ్‌పై విమర్శలొద్దు..
X

ఒకప్పటి సౌత్ అండ్ బాలీవుడ్ హీరోయిన్ శాంతి ప్రియ.. స్కిన్ కలర్ విషయంలో ఎన్ని ఇబ్బందులను, ఎన్ని అవమానాలను ఎదుర్కొంటామో.. తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. ‘ఇక్కే పె ఇక్కా’ సినిమా చేస్తున్నప్పుడు కోస్టార్ అక్షయ్ కుమార్ కూడా తన స్కిన్ కలర్‌పై కామెంట్ చేసినట్లు చెప్పింది. అప్పట్లో స్కిన్ కలర్ స్టాకింగ్స్ ధరించేదాన్నని తెలిపిన ఆమె.. స్టాకింగ్స్ కన్నా తన కలర్ చాలా ముదురుగా ఉందని కామెంట్ చేశాడని చెప్పింది. తను ఫ్రెండ్‌గా అలా కామెడీ చేసినా.. తను మాత్రం చాలా బాధ పడినట్లు తెలిపింది. అందుకే చర్మ రంగు గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలని చెప్పింది.

అయితే ఈ వార్తతో అక్షయ్‌పై ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు నెటిజన్లు. దీంతో శాంతి ప్రియ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అక్షయ్ కావాలని నన్ను హర్ట్ చేయలేదని.. తను నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పింది. తను చేసిన కామెంట్ ఇప్పటి వరకు గుర్తున్నా.. అవి నన్ను డిప్రెషన్‌కు గురి చేయలేదని చెప్పింది. ఈ విషయంలో అక్షయ్‌పై విమర్శలు చేయొద్దని సూచించిన ఆమె.. ఆయన పని తీరును గౌరవిస్తానని, తను మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.



Next Story

Most Viewed