చెన్నై తరపున ఆడటం నా అదృష్టం : వాట్సన్

by Shyam |
చెన్నై తరపున ఆడటం నా అదృష్టం : వాట్సన్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున ఆడటం తన అదృష్టమని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడిని సీఎస్కే చాలా బాగా చూసుకుంటుందని, తాను ఎన్నో మ్యాచ్‌లలో విఫలం అయినా తనకు అవకాశాలు ఇచ్చి నాలో ధైర్యాన్ని నింపిందని వాట్సన్ అన్నాడు. గత సీజన్‌లో తాను చాలా సార్లు తక్కువ స్కోరుకే అవుటయ్యాను.. కానీ ఆ సమయంలో మేనేజ్‌మెంట్ నా తరపున నిలిచిందని చెప్పాడు. 2018 నుంచి సీఎస్కే తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ అంతకు ముందు రాజస్థాన్, బెంగళూరు జట్ల తరపున ఆడుతున్నాడు. ఒక యూట్యూబ్ షోలో మాట్లాడుతూ…

‘2018 ఐపీఎల్ సీజన్ నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఫైనల్స్‌లో తాను ఆడిన ఇన్నింగ్స్ జట్టు టైటిల్ గెలవడానికి కారణమైంది. అయితే గత సీజన్‌లో అంచనాల మేరకు రాణించలేదు. తాను గతంలో ఆడిన జట్లు తక్కువ పరుగులు చేస్తే పక్కన పెట్టేవి. కానీ చెన్నై జట్టు అలా చేయలేదు. కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమ్మింగ్ తనపై నమ్మకం ఉంచారు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడినప్పుడు కూడా తాను ధోనీని పొగిడేవాడిని. అతడు మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా గొప్ప వ్యక్తి’ అని వాట్సన్ చెప్పుకొచ్చాడు. 2018 ఐపీఎల్ ఫైనల్స్‌లో పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ జట్టపై 51 బంతుల్లోనే సెంచరీ చేసి అద్బుత విజయాన్ని అందించాడు.

Advertisement

Next Story

Most Viewed