'ఐపీఎల్‌లో ఒక్కో బౌలర్‌కు 5 ఓవర్లు ఇవ్వాలి'

by  |
ఐపీఎల్‌లో ఒక్కో బౌలర్‌కు 5 ఓవర్లు ఇవ్వాలి
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఒక్కో బౌలర్‌కు గరిష్టంగా ఐదు ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాలని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ ప్రతిపాదించాడు. అంతర్జాతీయ టీ20లో ఈ నిబంధనను ఐసీసీ అమలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ముందుగా ఐపీఎల్‌లో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని వార్న్ కోరాడు. ట్విట్టర్‌లో ఈ ప్రతిపాదన చేసిన వార్న్ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, ఐసీసీలను ట్యాగ్ చేశాడు. టీ20లో ఈ ప్రతిపాదనను ఎంతో మంది సమర్థిస్తున్నారు.

ఆ సడలింపును ఐపీఎల్‌లో అమలు చేయాలన్నాడు. వార్న్ పోస్టును సమర్థిస్తూ అనేక మంది రీట్వీట్లు కూడా చేస్తున్నారు. టీ20ల్లో నాణ్యత పెంచేందుకు ఈ నిర్ణయం ముందే తీసుకోవాల్సిందని అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆల్‌రౌండర్లకు తప్పక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేసే వీలుంది. ఎక్కువ మందికి బౌలింగ్ అవకాశం కల్పించాలని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.


Next Story