- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామాయణం బాటలో శక్తిమాన్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ నేపథ్యంలో ఆ పాత మధుర టీవీ కార్యక్రమాలను ప్రసారం చేయాలని దూరదర్శన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అలనాటి రామాయణ్, మహాభారత్ సీరియళ్లని తిరిగి ప్రసారం చేస్తోంది. ఇక ఇదే బాటలో అలనాటి సూపర్ హీరో సీరియల్ శక్తిమాన్‌ని కూడా దూరదర్శన్ పునఃప్రసారం చేయబోతోంది. వీటితోపాటు భ్యూమకేష్ భక్షి, హమ్ హై నా, తు తోతా మే మైనా, ఇంకా షారుక్ ఖాన్ నటించిన సర్కస్ సీరియళ్లను కూడా డీడీ ప్రసారం చేస్తోంది.
అంతేకాకుండా చాణక్య, ఉపనిషద్ గంగ, శ్రీమన్ శ్రీమతి, కృష్ణ కళీ సీరియళ్లను కూడా దూరదర్శన్, డీడీ భారతి ఛానళ్లలో పునః ప్రసారం చేయనున్నట్లు కేంద్ర సమాచారా ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సీరియళ్లన్నీ ఏప్రిల్ మొదటివారం నుంచి ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని డీడీ ఛానళ్లను లోక్‌సభ, రాజ్యసభ ఛానళ్లతో సహా తప్పకుండా ప్రసారం చేయాలని డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్లను ప్రసార శాఖ ఆదేశించింది.
Tags : Doordarshan, Shaktimaan, DD, DTH, Ramayan, Quarantine, Corona, Lockdown