వికెట్లను తన్నాడు.. బంగ్లా క్రికెటర్ ఇలా చేశాడేంటి..?

by Anukaran |   ( Updated:2021-06-11 12:38:26.0  )
వికెట్లను తన్నాడు.. బంగ్లా క్రికెటర్ ఇలా చేశాడేంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: షకిబ్ అల్ హసన్.. బంగ్లా జట్లులో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు ఇతడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఆల్‌రౌండర్ అభిమానులకు సంపాదించాడు. ప్రస్తుతం మాత్రం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాడు. క్రీడాస్ఫూర్తిని మరిచి ఓ అంతర్జాతీయ ఆటగాడు ఇలా చేశాడేంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ అప్పీల్‌ను తిరస్కరిచండంతో ఏకంగా వికెట్ల తన్నాడు. మరోసారి కోపంగా అంపైర్ మీదకు వచ్చి వికెట్ల నెలకేసి కొట్టాడు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి

ఇంతకీ ఏం జరిగిందంటే..

డొమెస్టిక్ క్రికెట్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాలో మొహమెదాన్‌, అబహాని లిమిటెడ్‌ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ జరిగింది. అబహాని జట్టులో మరో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మొహమెదాన్‌ తరఫున షకిబ్‌ బౌలింగ్‌ చేశాడు. ఇదే క్రమంలో బంతి వేసిన షకిబ్ ఎల్బీడబ్ల్యూగా అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం అది నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారి కోపం తెచ్చుకున్న షకిబ్ వికెట్ల తన్నాడు. అంతటితో ఆగకుండా.. మరోసారి కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేస్తూ అంపైర్ నిర్ణయం తీసుకోవడంతో.. మైదానం నుంచి క్రీజువరకు పరుగెత్తుకొచ్చిన షకిబ్ అంపైర్‌ మీదకు వచ్చి రెండు వికెట్లను నెలకేసి కొట్టాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో షకిబ్ అంపైర్‌లపై విరుచుకుపడడం చర్చనీయాంశం అయింది.

ఇక మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై స్పందించిన షకిల్.. కోపంతో ప్రవర్తించినందుకు క్షమాపణలు తెలిపాడు. కొన్ని సార్లు అలా జరిగిపోతాయని చెబుతూనే.. అది ఒక మానవ తప్పిదం అంటూ అభివర్ణించాడు. సీనియర్ ప్లేయర్‌ను అయి ఉండి ఇలా ప్రవర్తించకూడదని.. భవిష్యత్తులో మరోసారి ఇలా ప్రవర్తించను అని తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు. కాగా, రూల్ ప్రకారం ఇలా ప్రవర్తించిన ఆటగాళ్లపై ఒక మ్యాచ్‌ను నిషేధించే అవకాశం ఉంది. దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకోనుందో అని ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story