ఫిర్యాదు దారుడే అసలు నిందితుడు..

by  |
ఫిర్యాదు దారుడే అసలు నిందితుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : షేక్‌పేట్ తహశీల్దార్ అరెస్టు వెనుక అనేక కుట్ర పరిణామాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. నాడు ఎమ్మార్వో గురించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించిన సయ్యద్ అబ్దుల్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో బంజారాహిల్స్‌లో ఎకరం భూమి కొట్టేసేందుకు అతను పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ భూమి తనకు చెందినట్లుగా చూపించేందుకు షేక్‌పేట రెవెన్యూ అధికారులకు రూ.15లక్షలు లంచాలు ఆశ చూపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఆ ల్యాండ్ విలువ దాదాపు రూ.100కోట్లు ఉండగా, దానిని కొట్టేసేందుకు అబ్దుల్ స్కెచ్ వేశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే, బంజారాహిల్స్ రోడ్ నెం.14 షేక్ పేట్ మండలంలో గల 4,865 గజాల భూమిని ఫోర్జరీ సంతకాలతో దక్కించుకునేందుకు సయ్యద్ అబ్దుల్ ప్లాన్ వేశాడు. గతంలో ఇదే భూమి విషయంలో బంజారాహిల్స్ ఎస్సై, షేక్‌పేట తహశీల్దార్ లకు లంచాలు ఆశ చూపాడు. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి వారిని అరెస్టు చేయించాడు. దీనంతటి వెనుక అబ్దుల్ సయ్యద్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అసలు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.



Next Story

Most Viewed