- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ ఇంటికి కరోనా ప్రొటెక్షన్!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. చిన్న, పెద్ద, సామాన్యుడు, సెలెబ్రిటీ అనే తేడా లేకుండా అందరికీ హలో ఇచ్చి వెళ్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇతర బాలీవుడ్ నటులు అప్రమత్తం అవుతున్నారు. బయటకు వెళ్లేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ.. అత్యవసరం అనుకుంటేనే కాలు బయటపెడుతున్నారు. ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్ ఏకంగా ఇంటిని మొత్తం ప్లాస్టిక్ కవర్లతో కప్పేశాడు. ముంబైలోని తన మన్నత్ బంగ్లాను పూర్తిగా కవర్లతో కవర్ చేశాడు. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌ఓ) ప్రకటనతో షారుఖ్ ఈ విధంగా జాగ్రత్తపడ్డారని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షారుఖ్‌తో పాటు భార్య గౌరీఖాన్, ముగ్గురు పిల్లలు ఉండే మన్నత్ బంగ్లాకు కరోనా నుంచి సూపర్ ప్రొటెక్షన్ వచ్చేసిందంటున్న నెటిజన్లు.. మిగతా సెలెబ్రిటీలు కూడా ఫాలో కావచ్చని సలహా ఇస్తున్నారు.