- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యాక్షన్ సిరీస్‌లో షాహిద్.. ‘గవర్’ టైటిల్ ఫిక్స్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టనున్నాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వస్తున్న సిరీస్‌తో వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా హిందీ ‘జెర్సీ’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన షాహిద్.. జనవరి నుంచి ఈ సిరీస్ కోసం పనిచేయనున్నారని తెలుస్తోంది. ఆరు నెలల పాటు అంటే జనవరి నుంచి జూన్ వరకు సిరీస్ కోసం డేట్స్ కేటాయించగా, నాలుగు షెడ్యూల్స్‌లో పూర్తి కానుందట. బీచ్ సిటీ గోవాలోనూ ఓ షెడ్యూల్ ఉండగా.. సౌత్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్న సిరీస్‌లో హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్న సిరీస్‌కు ‘గవర్’ టైటిల్ ఫిక్స్ కాగా.. షాహిద్‌తో రాజ్ అండ్ డీకే కొలాబరేషన్ కంప్లీట్ ప్యాకేజ్‌లా ఉంటుందంటున్నారు సినీ విశ్లేషకులు.