ఆయన పుట్టిన రోజుపై మళ్లీ వివాదం

by Shiva |
ఆయన పుట్టిన రోజుపై మళ్లీ వివాదం
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వయసుపై మొదటి నుంచి వివాదం నడుస్తూనే ఉన్నది. దూకుడైన ఆటకు మారుపేరైన అఫ్రిది 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అప్పుడు తన వయసు 16గా పేర్కొన్న అఫ్రిది అదే విషయాన్ని ఐసీసీకి కూడా తెలియజేశారు. దాని ప్రకారం ఆయన వయసు 41 ఏళ్లుగా ఉండాలి. కానీ అఫ్రిది వయసు ఒక్కో చోట ఒక్కోలా నమోదవుతున్నది. మార్చి 1తో తాను 44 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ట్వీట్ చేశాడు. అయితే ఐసీసీకి చెప్పిన దాని ప్రకారం ఆయన వయసు 41 ఏళ్లుగా ఉండాలి.

గతంలో తన ఆటో బయోగ్రఫీలో తాను 1975లో పుట్టినట్లు పేర్కొన్నారు. అరంగేట్రం సమయంలో 1980 అని తప్పుగా రాసినట్లు తెలిపారు. దాని ప్రకారం చూస్తే ఆయన వయసు 46 ఏళ్లు కావాలి. క్రిక్ ఇన్ఫో రికార్డుల ప్రకారం 41గా చెబుతున్నారు. ఇలా ఒక్కో చోట ఒక్కో ఏజ్ ఉన్నా.. అఫ్రిది ఏనాడు తన కచ్చితమైన పుట్టిన తేదీని మాత్రం చెప్పడం లేదు. దీంతో సోమవారం పుట్టిన రోజు చేసుకున్న ఆయన ఇప్పటికీ అస్పష్టంగానే తన వయసు చెప్పుకోవడంపై తిరిగి వివాదం చోటు చేసుకున్నది.

Advertisement

Next Story

Most Viewed