అంత ఆరోగ్యంగా ఏం లేను : షారుఖ్

by Shyam |   ( Updated:2021-06-25 03:50:22.0  )
AskSRK
X

దిశ, సినిమా : కింగ్ ఖాన్ షారుఖ్ నేటితో బాలీవుడ్‌లో 29 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ‘ఆస్క్ ఎస్‌ ఆర్కే’ పేరుతో చాట్ సెషన్ నిర్వహించిన బాద్‌షా.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాదు తన అప్‌కమింగ్ ఫిల్మ్స్‌తో పాటు ఇతరత్రా ప్రశ్నలకు హిలేరియస్ ఆన్సర్స్‌ ఇచ్చి అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తన హెల్త్‌పై జోక్ పేల్చిన షారుఖ్, తన ఆరోగ్యం ఎలా ఉందన్న ఫ్యాన్ ప్రశ్నకు.. ‘జాన్ అబ్రహం అంత ఫిట్‌గా లేను కానీ నా వరకు నేను ఒకే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక బీటౌన్ పీస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ హిరానీతో సినిమా చేస్తున్నారా? అని అడిగితే షారుఖ్ చెప్పిన జవాబుతో నెటిజన్లు అవాక్కయ్యారు.

‘ఇప్పుడే అతనికి కాల్ చేసి, నాతో సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తాను.. ఎందుకంటే తను రాత్రి ఆలస్యంగా నిద్రపోతాడు’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. నిజానికి హిరానీతో షారుఖ్ ఒక సోషల్ కామెడీ మూవీ చేయబోతున్నారనే న్యూస్ ఎప్పటినుంచో చక్కర్లు కొడుతుండగా.. అఫిషియల్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక చివరిసారిగా ‘జీరో’ మూవీలో కనిపించిన షారుఖ్.. ప్రస్తుతం ‘పఠాన్’లో నటిస్తున్నారు. ఇందులో జాన్ అబ్రహంతో పాటు దీపికా పదుకొనే నటిస్తున్నారు.

Advertisement

Next Story