- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్క కూతురిపై కన్నేసిన తమ్ముడు.. ఏడు నెలలుగా బాలికపై..
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవలి కాలంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తెలియని వ్యక్తులతో దాడులు జరుగుతుండగా.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఏకంగా కుటుంబ సభ్యులే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సొంత తమ్ముడే అక్క కూతురుపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. జల్‌పల్లికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మైనర్ కుమార్తెలతో పాటు ఓ కుమారుడు ఉన్నారు. కాగా, ఆమె భర్త తాగుడుకు బానిసై పదేళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె తన తల్లిగారింట్లోనే నివాసం ఉంటోంది. వారితో ఉంటూనే కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో తనకు, పిల్లలకు తోడుగా ఉంటారని భావించిన ఆమె సోదరుడే.. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పెద్ద కూతురుపై కన్నేసిన కామాంధుడు.. ఏడు నెలలుగా మైనర్‌పై అత్యాచారం చేస్తూ.. గర్భానికి కారణమయ్యాడు.
అనుమానంతో ఆమెను.. తల్లి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. సొంత తమ్ముడే ఇంత దారుణానికి ఒడిగట్టాడని సదరు మహిళ షాక్‌కు గురైంది. ఈ విషయం తల్లికి చెప్పి.. బాలిక అమ్మమ్మతో పాటు నిందితుడు కలిసి అబార్షన్ చేయించారు. ఈ దారుణ ఘటనను భరించలేని సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారి స్పందన సరిగా లేకపోవడంతో బాధితురాలి తల్లి స్థానిక నేతలను కలసి తమకు న్యాయం చేయాలని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.