శృంగారంలో మా ఆయన బాగా సంతోష పెడతారు కానీ..

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-30 15:49:56.0  )
శృంగారంలో మా ఆయన బాగా సంతోష పెడతారు కానీ..
X

నా వయసు 34 సంవత్సరాలు. మావారి వయసు 44 సంవత్సరాలు. మాకు వివాహమై 15 సంవత్సరాలయింది. దాంపత్య జీవిత సౌఖ్యాన్ని ఎంతో ఆనందంగా గడిపాం. ప్రత్యేకించి మా వారు నేను శృంగారంలో ఆనందం పొందే విధంగా పోర్ ప్లే చేస్తారు. అయితే ఈ మధ్య ఆయన అంగస్తంభన విషయంలో ఆందోళన చెందుతూ... నా సంతృప్తిని గురించి అడిగి తెలుసుకుంటున్నారు. నాకు బాగానే ఉందన్నా ఆయన నమ్మటం లేదు. ఇదే సమయంలో మా బంధువులలో ఒకామె ఈ విషయంలో ఆయనపై అనుమానం కలిగేలా మాట్లాడింది. మా వారికి షుగరు బయటపడింది. మందులు వాడుతున్నారు. నా అనుమానాలకు ఒకసారి బెత్తంతో సమాధానం చెప్పారు. బాధ కలిగింది. రాజీపడ్డాను. ఆయనలో వీక్‌నెస్‌కు నన్ను శిక్షిస్తే ఎలా? నా వక్షోజాలు బిగువులో మార్పు కూడా గమనించాను. అయితే ఈ మధ్య శృంగారంలో కండరాలు బిగుసుకుపోయి నొప్పిగా అన్పించడంతో పాటు అంతకు ముందులా శృంగారంలో పాల్గొనలేకపోతున్నాను. ఎందుకో చెప్పగలరు. - సరస్వతి

మీరు మీ పక్కింటావిడ చెప్పుడు మాటలు విని మీ వారి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేశారు. మీవారు సెక్సులో మీరు ఆర్గాజం పొందటానికి ప్రయత్నిస్తూనే ఉంటారని రాశారు. షుగరు, వాటికి వాడే మందులు, మానసిక ఆందోళనల వల్ల మీవారిలో అంగస్తంభన సమస్య వచ్చుంటుంది. మంచి ఆహారం, యోగా, సరైన మందులు వాడటంతో పాటు మీ సహకారం ఉంటే మీవారి సమస్య తీరుతుంది. అలాగే అంగప్రవేశానికి ముందే ఫోర్ప్లే వల్ల మీరు అంగజం పొందుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మీవారి సమస్య తీరేవరకు అదే పద్ధతిని పాటించండి. మీ వారిని మంచి సెక్సాలజిస్టును కలవమని చెప్పండి.

- డాక్టర్ భారతి. MS

సైకోథెరపిస్ట్ &సెక్సాలజిస్ట్

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Advertisement

Next Story