సొంత ఖర్చులతో ఏడు రోజుల క్వారంటైన్

by Shamantha N |
సొంత ఖర్చులతో ఏడు రోజుల క్వారంటైన్
X

న్యూఢిల్లీ : దేశరాజధానిలో కరోనా కేసులను అదుపులో ఉంచేందుకు సెంట్రల్ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చేవారు సొంత ఖర్చులపైనే ఏడు రోజులు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని, తర్వాత ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలని ఎయిర్‌పోర్టు అథారిటీ సూచనలు చేసింది. ఈ నిబంధనను అంగీకరించినట్లు టికెట్ కన్ఫామ్ కాకముందే ప్రయాణికులు ఎంబసీ లేదా ఎవర్సీస్ మిషన్‌కు తెలుపాల్సి ఉంటుంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలోనే ఉండాలనుకునే వారికి విమానాశ్రయంలోనే కాక బయట ఢిల్లీ సర్కారు పోస్టులోనూ థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. అయితే, గర్భిణిలు, మృతుల కుటుంబీకులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పదేళ్లలోపు పిల్లలతో ఉన్న తల్లిదండ్రులకు ఈ నిబంధన నుంచి ఉపశమనం ఉంటుందని అధికారులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed