కోదాడలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు

by Shyam |
కోదాడలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు
X

దిశ, కోదాడ: కోదాడలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ 25 మందిలో 7 కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. అందులో ఒకరు నల్లబండగూడెం గ్రామం, మరొకరు చిలుకూరు మండలం చెందినవారుగా సమాచారం. పట్టణంలో నాలుగు కేసులు మారుతీనగర్‌లో 2, టీచర్స్ కాలనీలో 1, సాలార్జంగ్ పేటలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి పనిలో పడ్డారు.

Advertisement

Next Story