- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈనెల 21 నుంచి… ఆ శిక్షణా కేంద్రాలు ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతుండటంతో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా కేంద్రాలు కూడా మూతపడ్డాయి. కాగా ప్రభుత్వం ఇటీవల అన్‌లాక్ ప్రకృయ మొదలు పెట్టి, సడలింపులు ఇవ్వడంతో ఈ కేంద్రాలను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభిస్తున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
శిక్షణా కేంద్రాల్లోకి ప్రవేశించే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ మాస్కు తప్పక ధరించాలని సూచించారు. శిక్షణా కేంద్రాల్లోని తరగతి గదుల్లో 20 మందికి మించి విద్యార్ధులు ఉండరాదని, వారు కూడా భౌతిక దూరం పాటించాలని అన్నారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వారికి టెస్టులు చేయాలని తెలిపారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని శిక్షణా కేంద్రాలకు సూచించారు.