రోబోలతో కరోనా పేషెంట్లకు సేవలు.. ఎక్కడంటే..?

by  |
రోబోలతో కరోనా పేషెంట్లకు సేవలు.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు. ఆస్పత్రులలో డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆస్పత్రులలో సేవలందిస్తూ చాలా మంది డాక్టర్లు, సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఓ ఆసుపత్రి యాజమాన్యం కొత్తగా అడుగులు వేసింది. ఆ ప్రయోగం భలే విచిత్రంగా అనిపిస్తోంది. కానీ, బాగుందని అనిపిస్తోంది. విషయమేమిటంటే.. గుజరాత్ లోని వడోదరలో ఉన్న ఎస్ఎస్జీ అనే ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా పేషెంట్లకు ఆహారం, మెడిసిన్లు అందించేందుకు రెండు రోబోలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి చక్కగా కరోనా రోగులకు సేవలందిస్తున్నాయి. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా ఉందంటున్నారు.


Next Story

Most Viewed