- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రోత్సాహకాలు కొనసాగితే 28 శాతం ఎగుమతులు సాధ్యమే..
దిశ, వెబ్‌డెస్క్: సేవల ఎగుమతుల ప్రోత్సాహక మండలి(ఎస్ఈపీసీ) దేశీయంగా సేవల ఎగుమతులు ఆరోగ్యకరమైన వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఎగుమతుల రంగానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కొనసాగించడం అవసరమని ఎస్ఈపీసీ తెలిపింది. దీనిద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 28 శాతం వృద్ధితో దాదాపు 266 బిలియన్ డాలర్లకు(రూ. 19.74 లక్షల కోట్లు)కు చేరుకుంటాయని ప్రోత్సాహక మండలి అంచనా వేసింది. ఎస్ఈపీసీ ఛైర్మన్ మానెక్ దావర్ మాట్లాడుతూ..ప్రస్తుత ఏడాది మొదటి త్రైమాసికంలో ఎగుమతులు 54 బిలియన్ డాలర్లు(రూ. 4 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి.
కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రొఫెషనల్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఆడియో విజువల్, సంబంధిత సేవలు, సరుకు రవాణా సేవలు, టెలీకమ్యూనికేషన్, కంప్యూటర్, ఐటీ సేవలు వంటి రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదవడంతో సేవల ఎగుమతులు ఆశాజనకమైన వృద్ధిని సాధించినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కొనసాగితే ఈ రంగం పనితీరు మరింత మెరుగ్గా, స్థిరంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ నుంచి సేవల ఎగుమతుల అనిశ్చితులను తొలగించేందుకు కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించాలని ఆయన సూచించారు.