'స్పుత్నిక్ వీ’ తయారుచేయనున్న సీరం..

by vinod kumar |   ( Updated:2021-06-03 05:44:20.0  )
స్పుత్నిక్ వీ’ తయారుచేయనున్న సీరం..
X

న్యూఢిల్లీ: అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ టీకాను తయారు చేయడానికి సిద్ధమైంది. అందుకోసం భారత రెగ్యులేటరీ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ టీకా ప్రయోగాలకూ అనుమతులు ఇవ్వాలని కోరినట్టు తెలిపాయి. భారత్‌లో స్పుత్నిక్ వీ టీకా తయారీకి అనుమతి ఇవ్వాలని బుధవారం అప్లికేషన్ పెట్టుకున్నట్టు పేర్కొన్నాయి.

ప్రస్తుతం స్పుత్నిక్ వీ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ సంస్థ ఉత్పత్తి చేస్తున్నది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన టీకాను కొవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ ప్రస్తుతం భారత్‌లో తయారీ, సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సామర్థ్యాన్ని పెంచుకుందని, జూన్‌లో పదికోట్ల కొవిషీల్డ్ టీకాలను సరఫరా చేస్తామని ఇటీవలే వెల్లడించింది. ఆస్ట్రా జెనెకా టీకాతోపాటు అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకాను తయారీ చేస్తున్నది. తాజాగా, స్పుత్నిక్ వీ టీకా తయారీకి ప్రయత్నాలు ప్రారంభించింది.

Advertisement

Next Story

Most Viewed