రూ. 225కే కరోనా టీకా డోసు

by  |
రూ. 225కే కరోనా టీకా డోసు
X

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) రూ. 225కే అందించనుంది. కరోనా టీకాల తయారీ వేగంగా చేపట్టడానికి ఎస్ఐఐకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 150 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సహాయం చేయనుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రా జెనెకా, నోవావాక్స్‌తో ఎస్ఐఐ ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే. కొత్త ఒప్పందం ప్రకారం, భారత్ సహా పేదదేశాలకు 10 కోట్ల కరోనా టీకా డోసులను అందజేయాల్సి ఉంటుంది. అది కూడా రూ. 225కే అందించాలి. అంటే, ఆక్స్‌ఫర్డ్ సహా నోవావాక్స్ టీకాలను ఎస్ఐఐ రూ. 225కే అందించాల్సి ఉంటుంది.

గేట్స్ ఫౌండేష నిధులను గావి(జీఏవీఐ-ది వ్యాక్సిన్ అలయెన్స్) ద్వారా సీరంకు అందజేస్తుంది. ఫలితంగా సీరం రెండు టీకాలను తగినమోతాదులో తయారుచేసే సామర్థ్యాన్ని సంతరించుకోగలదు. ఈ టీకాలను కోవాక్స్ విధానంలో పంపిణీ చేస్తారు. టీకాలను ద్వైపాక్షిక సంబంధాలకు అనుగుణంగా అందజేతకు బదులు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గావి, సీఈపీఐ, డబ్ల్యూహెచ్‌వోలు కోవాక్స్‌కు రూపకల్పన చేశారు. దాత దేశాల నుంచి విరాళాలను సేకరించి టీకాలను కొనుగోలు చేసి పేద దేశాలకు అందిస్తారు.


Next Story

Most Viewed