బుల్లితెర నటి శ్రావణి సూసైడ్..

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం అర్థరాత్రి తను ఉంటున్న ఇంట్లో బాత్‌రూంలో విగతజీవిగా కనిపించిందని కుటుంబసభ్యులు తెలిపారు.ఈ ఘటన SR నగర్ పీఎస్ పరిధిలోని మధుర నగర్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..

కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి Tictok ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. అయితే, గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి నిన్న రాత్రి బాత్రూంలోకి వెళ్లి ఉరేసుసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకూ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా విగత జీవిగా పడి ఉంది. వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. దేవరాజు రెడ్డి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు SRనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, శ్రావణి గత 8ఏళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్ మౌనరాగం, మనసు మమత, పలు సీరియళ్లలో నటిస్తోంది.

Advertisement