శ్రావణి సూసైడ్ కేసులో కొత్త కోణం

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అతను ఓ వీడియోను విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, డబ్బుల కోసం ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చాడు. గతంలో ఇంట్లోవాళ్ల ఒత్తిడితోనే శ్రావణి నాపై కేసు పెట్టిందని వివరించాడు. సాయి అనే వ్యక్తి నా ముందే శ్రావణిని చంపాలని చూశాడని, అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగిందన్నాడు. శ్రావణిని పెళ్లి చేసుకోవాలని సాయి తీవ్రంగా ప్రయత్నించాడని.. కానీ ఆమె ఒప్పుకోనందుకు చంపాలని చూశాడన్నారు.

ఇంట్లోవాళ్లు, సాయి హింసిస్తున్నారని, మూడురోజుల షూటింగ్ తర్వాత తన దగ్గరకు వస్తానని ఇటీవలే శ్రావణి ఫోన్ చేసి చెప్పిందని దేవరాజ్‌రెడ్డి అన్నాడు. ఆ సమయంలోనే తాను చనిపోతానని చెబితే ఆలాంటి పిచ్చి పనులు ఏవీ చేయొద్దని సూచించానని తెలిపాడు. తన చావుకు సాయి కారణమని ఫోన్‌లో వాయిస్ రికార్డు చేసిన శ్రావణి.. ఈ విషయాన్ని దేవరాజ్‌రెడ్డికి తెలిపింది. ప్రస్తుతం ఆడియో వైరల్‌గా మారింది.

Advertisement