భారీగా నష్టపోయిన మార్కెట్లు

by  |
భారీగా నష్టపోయిన మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండ్రోజులుగా స్వల్ప నష్టాల(Slight losses)తో సరిపెడుతున్న దేశీయ మార్కెట్లు (Domestic markets) వారాంతం భారీగానే నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు (International markets) ఊగిసలాటలో ఉన్నప్పటికీ శుక్రవారం ఉదయం ఈక్విటీ మార్కెట్లు(Equity markets) సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే, తర్వాతి పరిణామాల్లో మిడ్ సెషన్ (Mid session) తర్వాత ఒక్కసారిగా కుదేలయ్యాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్ (Banking), ఆటో (Auto), ఫైనాన్స్ షేర్లు (Finance shares) అమ్మకాలు ఒత్తిడికి గురవడంతో నష్టాలు (Losses) తప్పలేదు. అంతర్జాతీయ మార్కెట్లు(International markets), ఏజీఆర్ (AGR) బకాయిలకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు (Supreme Court) లో ప్రారంభమవడం లాంటి పరిణామాలతో అమ్మకాలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు (Market analysts) అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ ఇండెక్స్‌(Sensex Index)లో 433.15 పాయింట్లను నష్టపోయి 37,877 వద్ద ముగియగా, నిఫ్టీ 122.05 పాయింట్ల నష్టంతో 11,178 వద్ద ముగిసింది. నిఫ్టీ (Nifty)లో అత్యధికంగా బ్యాంకింగ్ (Banking), ఆటో రంగాలు (Auto fields) డీలా పడగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, ఐటీ రంగాలు కొంత నష్టపోయాయి.

మెటల్(Metal), ఫార్మా రంగాలు(Pharma sectors) మాత్రమే కొంత లాభపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌(Sensex Index)లో సన్‌ఫార్మా(Sun Pharma), ఎన్‌టీపీసీ(NTPC), టాటాస్టీల్(Tata Steel), టైటాన్ (Titan), ఇన్ఫోసిస్ (Infosys) సూచీలు మాత్రమే లాభపడగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలను నమోదు చేశాయి. అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఎస్‌బీఐ (SBI), ఎంఅండ్ఎం (M & M), బజాజ్ ఫైనాన్స్ (Bajaj Finance), ఐటీసీ (ITC), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank), హెచ్‌సీఎల్(HCL), ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), మారుతీ సుజుకి (Maruti Suzuki), కోటక్ బ్యాంక్ (Kotak Bank) షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఇక, అమెరికా డాలరు (Dollar) తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.90 వద్ద ఉంది.


Next Story