ఊగిసలాటలో మార్కెట్లు!

by  |
ఊగిసలాటలో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాల నుంచి కోలుకున్నాయని భావించిన మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనై బుధవారం స్వల్పంగా నష్టపోయాయి. పెట్టుబడిదారులు ఎక్కువగా కొనుగోళ్లకు సిద్ధపడటంతో ఉదయం ప్రారంభ సమయంలో 300 పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు తర్వాతి పరిణామాల్లో ఊగిసలాటకు లోనైంది.

మిడ్ సెషన్ అనంతరం నెమ్మదిగా డీలాపడ్డ మార్కెట్లు చివరి గంటలో అటిటూగా ఊగిసలాడి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ మాత్రం లాభాల్లో క్లోజవ్వడం గమనార్హం. సెన్సెక్స్‌లో మిడ్ సెషన్ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగిపోవడం కారణంగానే సూచీలు ఆటుపోట్లకు గురై స్వల్ప నష్టాలను చూసినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 24.58 పాయింట్ల నష్టంతో 37,663 వద్ద ముగియగా, నిఫ్టీ 6.40 పాయింట్లు లాభపడి 11,101 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, టైటాన్, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభాలను నమోదు చేయగా, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీలో ముఖ్యంగా మెటల్ రంగ సూచీలు 4 శాతానికిపైగా ర్యాలీ చేశాయి, ఆటో, మీడియా లాభాల్లో ట్రేడవ్వగా, ఫార్మా రంగం కొంత డీలాపడ్డాయి.


Next Story

Most Viewed