అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు!

by  |
అమ్మకాల ఒత్తిడితో నష్టపోయిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల సంకేతాలు ఊగిసలాటలో ఉండటంతో ఉదయం నుంచే ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. లంచ్ సమయం తర్వాత అమ్మకాల జోరు పెరగడంతో చివరికి మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ట్రేడర్లు ఎక్కువగా లాభాల స్వీకరణకు ప్రాధాన్యమివ్వడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 421.82 పాయింట్ల నష్టంతో 38,071 వద్ద ముగియగా, నిఫ్టీ 97.70 పాయింట్లు కోల్పోయి 11,202 వద్ద ముగిసింది. నిఫ్టీలో అధికంగా ఫార్మా రంగం 3 శాతం పుంజుకోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్ రంగాలు లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీ, ఆటో రంగాలు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రా సిమెంట్, ఎల్అండ్‌టీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, రిలయన్స్, నెస్లె ఇండియా, హెచ్‌సీఎల్, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.



Next Story