ర్యాలీ చేసిన మార్కెట్లు.. 50 వేల పైకి సెన్సెక్స్

by Harish |
ర్యాలీ చేసిన మార్కెట్లు.. 50 వేల పైకి సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి అధిక లాభాలను సాధించాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఆటో, ఐటీ షేర్ల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు డీలాపడినప్పటికీ దేశీయ సూచీలు లాభాలను దక్కించుకోగలిగాయి. మిడ్ సెషన్ సమయంలో కొంత తడబడినప్పటికీ చివరలో కీలక సూచీల అండతో మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా అమ్మకాలు జోరందుకోగా కీలక రంగాల్లో కొనుగోళ్లు ఆదుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 447.05 పాయింట్లు ఎగసి 50,296 వద్ద ముగియగా, నిఫ్టీ 157.55 పాయింట్లు లాభపడి 14,919 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఆటో, ఐటీ రంగాలు 2 శాతం మేర పుంజుకోగా, ఫార్మా, మెటల్, మీడియా రంగాలు బలపడ్డాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, మారుతీ సుజుకి, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, డా రెడ్డీస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.33 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed