లాక్‌డౌన్ ఎఫెక్ట్: లాభాల బాటలో మార్కెట్లు

by Harish |
లాక్‌డౌన్ ఎఫెక్ట్: లాభాల బాటలో మార్కెట్లు
X

కరోనా ఎఫెక్ట్‌తో నెల రోజులుగా నష్టాల బాటలో పయణిస్తున్న దేశీయు మార్కెట్లు బుధవారం కొద్దీగా కొలుకున్నాయి.
మహమ్మారి మరింత విజృంభించకుండా మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే 1 శాతం లాభాల్లోకి వెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్ 625.41 పాయింట్లకు ఎగబాకి 27,299.44 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత 174.22 పాయింట్లు కోల్పోయి 26,499.81 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 179.3 పాయింట్లు పెరిగి 7,980.35 పాయింట్లకు చేరుకుంది.

Tags: Sensex, Nifty, Lower ,21-Day Lockdown,Begins

Advertisement

Next Story

Most Viewed