వరుసగా మూడోరోజు భారీ నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
వరుసగా మూడోరోజు భారీ నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతం లాభాల స్వీకరణతో డీలాపడ్డ సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ అత్యధికంగా నష్టపోయింది. లాభనష్టాల మధ్య ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో కుంగిపోయాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 530.95 పాయింట్లు కోల్పోయి 48,347 వద్ద ముగియగా, నిఫ్టీ 133 పాయింట్లు నష్టపోయి 14,238 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంక్, ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాలు బలపడగా, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో, రియల్టీ రంగాలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, బజాజ్‌ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 5.36 శాతం క్షీణించింది. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, పవర్‌గ్రిడ్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.94 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed