స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by Harish |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. సూచీలు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ఉద్దీపన లేకపోవడంతో మార్కెట్లలో ఆటుపోట్లు కొనసాగయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉదయం ప్రారంభమైన తర్వాత భారీ లాభాలను చూసిన మార్కెట్లు, మిడ్‌సెషన్ అనంతరం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

దీంతో ప్రారంభ లాభాలు ఆవిరై చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడం, దేశీయంగా సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణం పెరగడం, ఆగష్టు నెల పారిశ్రామికోత్పత్తి తగ్గిపోవడం లాంటి పరిణామాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 31.71 పాయింట్ల స్వల్ప లాభంతో 40,625 వద్ద ముగియగా, నిఫ్టీ 3.55 పాయింట్లు లాభపడి 11,934 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీల్ టెక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఆల్ట్రా సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, టైటాన్, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.35గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed