మార్కెట్ల వీకెండ్ డౌన్!

by Harish |
మార్కెట్ల వీకెండ్ డౌన్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను నమోదు చేశాయి. రోజంతా ఊగిసలాటకు గురైన సూచీలు చివరికి స్వల్ప నష్టాలను దక్కించుకున్నాయి. శుక్రవారం జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించారని, అందుకే మార్కెట్లు నీరసించాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 110.02 పాయింట్లు కోల్పోయి 44,149 వద్ద ముగియగా, నిఫ్టీ 18.05 పాయింట్లు నష్టపోయి 12,968 వద్ద ముగిసింది.

నిఫ్టీలో రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీడియా, ఆటో రంగాలు 1 నుంచి 2 శాతం మధ్య పుంజుకోగా, ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, టైటాన్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్, ఓఎన్‌జీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఎంఅండ్ఎం, రిలయన్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.95 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed