మార్కెట్లలో లాభాలు జోరు!

by  |
మార్కెట్లలో లాభాలు జోరు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు నెలకొనడం, విదేశీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తిగా ఉండటంతో మార్కెట్లు శుక్రవారం లాభాలను నమోదు చేశాయి. మిడి సెషన్ తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలను ఆర్జించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523.68 పాయింట్ల లాభంతో 34,731 వద్ద ముగియంగా, నిఫ్టీ 152.75 పాయింట్లు లాభపడి 10,244 వద్ద ముగిసింది. రంగాల వారీగా పరిశీలిస్తే.. అమ్మకాలు పెరగడంతో బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ బలపడటం వల్ల ఐటీ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ రహిత సంస్థగా మారినట్టు ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించడంతో రిలయన్స్ షేర్లు 6 శాతానికి పైగా లాభపడ్డాయి. ఇక, సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఐటీసీ, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో కదలాడాయి. అమెరికా డాలరు‌తో రూపాయి మారకం విలువ రూ.76.10గా ఉంది.


Next Story

Most Viewed