- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు!
దిశ, సెంట్రల్ డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడికి గురవడంతో నష్టాలు నమోదయ్యాయి. పైగా, ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం సంవత్సరంలో మైనస్ 5 శాతం క్షీణత నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజా అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనట్టు చెప్పారు. గురువారం ప్రారంభమే ఊగిసలాటకు గురైన దేశీ మార్కెట్లు చివరికి స్వల్పంగా నష్టపోయాయి. దీంతో సెన్సెక్స్ 26.88 పాయింట్లను కోల్పోయి 34,842 వద్ద ముగియగా, నిఫ్టీ 16.40 పాయింట్లు నష్టపోయి 10,288 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంకుల సూచీలు లాభాల్లో ట్రేడవ్వగా, ఐటీ, మెటల్, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్ సూచీలు అధిక లాభాలను నమోదు చేయగా, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కదలాడాయి.