ఊగిసలాటల మధ్య లాభాలతో ముగిసిన మార్కెట్లు!

by  |
ఊగిసలాటల మధ్య లాభాలతో ముగిసిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనం తర్వాత వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో స్వల్ప లాభాలను నమోదు చేసిన సూచీలు, చివరి గంట వరకు ఊగిసలాటలోనే ఉన్నాయి. మిడ్ సెషన్ తర్వాత కాసేపు నష్టాల్లో ట్రేడయినప్పటికీ చివర్లో కొనుగోళ్ల మద్దతు కారణంగా లాభాలను చూడగలిగాయి.

ఆసియా మార్కెట్లు సానుకూల సంకేతాలివ్వడంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 185.23 పాయింట్లు లాభపడి 39,086 వద్ద ముగియగా, నిఫ్టీ 64.75 పాయింట్ల లాభంతో 11,535 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ముఖ్యంగా ఐటీ (IT), మీడియా (Media), ఆటో (Auto), మెటల్ రంగాలు (metal), అత్యధికంగా ట్రేడవ్వగా, ప్రైవేట్ బ్యాంకులు (private banks), ఫార్మా (Pharma), ఎఫ్ఎంసీజీ(FMCG), రియల్టీ (Realty) రంగాలు పుంజుకున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం (M&M), పవర్‌గ్రిడ్ (Powergrid), టాటాస్టీల్(Tata Steel), ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd), రిలయన్స్ (Reliance), హెచ్‌సీఎల్ (HCL), ఓఎన్‌జీసీ(ONGC), ఇన్ఫోసిస్ (Infosys), టెక్‌మహీంద్రా(Tech Mahindra), టీసీఎస్ (TCS), ఆల్ట్రా సిమెంట్ (Ultra Cement) షేర్లు అధిక లాభాలను చూడగా… బజాజ్ ఆటో (Bajaj Auto), ఏషియన్ పెయింట్స్ (Asian Paints), సన్‌ఫార్మా (Sun Pharma), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), నెస్లె ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనిలీవర్ (Hindustan Unilever), ఎన్‌టీపీసీ (NTPC), ఎస్‌బీఐ (SBI) షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.70 వద్ద ఉంది.



Next Story