- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు
దిశ, వెబ్‌డెస్క్ : బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో హఫీజ్‌పేటలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు కలిసి భూములు కొనుగోలు చేశారు. కాగా, భూమా నాగిరెడ్డికి ప్రవీణ్‌రావు తండ్రి కిషన్‌రావు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఇక భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఏవీ ఎస్టేట్స్ పేరుతో భూమిలో సుబ్బారెడ్డి పాగా వేశారు. ఈ నేపథ్యంలోనే 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై ప్రవీణ్ రావు ట్రేస్‌పాస్ కేసు పెట్టారు. మొత్తం 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాలు తీసుకునేందుకు సెటిల్‌మెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మిగతా 25 ఎకరాలు తమకే కావాలని ప్రవీణ్ రావుపై భూమా కుటుంబం ఒత్తిడి తీసుకొచ్చిన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్‌తో భూమా ఫ్యామిలీ ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌కు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసుల ఎంట్రీతో అసలు భాగోతం బయటపడింది.
ఏవీ సుబ్బారెడ్డి ఒకప్పుడు నా స్నేహితుడు: ప్రతాప్‌రావు
ఇది ఇలా ఉంటే ఏవీ సుబ్బారెడ్డి గతంలో తన ప్రాణ స్నేహితుడు అని ప్రవీణ్‌రావు సోదరుడు ప్రతాప్‌రావు మీడియాకు వెల్లడించారు. మూడు నెలల క్రితమే తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. ల్యాండ్ విషయంలో సుబ్బారెడ్డిపై కేసు పెట్టాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కేసు అనంతరం ల్యాండ్ విషయంలో సెటిల్మెంట్ కూడా జరిగిందని ప్రతాప్‌రావు తెలిపారు. ఇదే విషయాన్ని రెండేళ్ల క్రితం అఖిల సోదరి మౌనికకు కూడా చెప్పామన్నారు. కానీ, ల్యాండ్ వ్యవహారంలో భూమా నాగిరెడ్డి టచ్‌లో లేరని స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డితోనే మాట్లాడుకోవాలన్నారు. మమ్మల్ని బెదిరించి ల్యాండ్ కబ్జా చేయాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. పోలీసులు త్వరగా స్పందించడంతోనే తన సోదరులు ప్రాణాలతో బయటపడ్డారని ప్రతాప్‌రెడ్డి చెప్పుకొచ్చారు.