‘సెల్ఫీ విత్ హెల్మెట్’ చాలెంజ్

by Shyam |
Selfie with Helmet Challenge
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ జూనియర్ అంబాసిడర్ తానియా బేగం ‘సెల్ఫీ విత్ హెల్మెట్ పప్పా/మమ్మీ’ యాష్ ట్యాగ్ చాలెంజ్‌ను విసిరారు. ఇందులో భాగంగా ఐదుగురికి చాలెంజ్ ఇవ్వొచ్చని, ఈ చైన్ ద్వారా మరో ఐదుగురిని నామినేట్ చేసేందుకు అవకాశం ఉందని తానియా వివరించారు. బాధ్యతయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించేందుకు ఈ చాలెంజ్ ఉపయోగపడుతుందన్నారు. తానియా ‘సెల్ఫీ విత్ మమ్మీ’ ఫోటోతో సినీ నటి అమల అక్కినేని, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, భరణి కుమార్ అరోల్, భార్గవి లావణ్యకు చాలెంజ్ విసిరారు. రహదారి భద్రత విద్య గురించి అవగాహన కల్పించడానికి, ట్రాఫిక్ ఉల్లంఘనను నివారించేందుకు అందరూ పాల్గొనాలని ఆమె కోరారు.


Advertisement
Next Story

Most Viewed