- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒమిక్రాన్ టెన్షన్.. గూడెంలో 10 రోజుల సెల్ఫ్ లాక్‌డౌన్ (వీడియో)

X
దిశ, సిరిసిల్ల : ఒమిక్రాన్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను కలవరపెడుతోంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామాంలో గ్రామస్థులు సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకున్నారు. గ్రామానికి చెందిన వారు ఎవరూ బయటకు వెల్లొద్దని, బయటి వారు గ్రామానికి ఎవరూ రాకూడదని కోరుతున్నారు.
ఈ నెల 20న గూడెం గ్రామానికి చెందిన ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో అతన్ని హైదరాబాద్ టిమ్స్‌కు తరలించారు. మరో వైపున బాధితుని తల్లి, భార్యలకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించుకున్నారు. బాధితుడు ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపుర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో 53 మంది నమూనాలు సేకరించారు వైద్యాధికారులు. వారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు.
Next Story