- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ఆంక్షలు ప్రభుత్వం విధించినవి కాదు
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం, తిరుపతిల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షాపింగ్ వేళలను కుదించారు. ఈ మేరకు వ్యాపారులే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించడం కొసమెరుపు. వైజాగ్‌లోని పూర్ణామార్కెట్‌తో పాటు తిరుపతిలోని హోల్ సేల్ వ్యాపారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుదిస్తూ హోల్ సేల్ వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ఆంక్షలు సడలించడంతో బాధ్యత మరచి ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని, ఇది సాటి వారికి ప్రాణాంతకంగా మారుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిలో మార్పు తెచ్చేందుకు చేతనైనంత చేద్దామని వ్యాపారులంతా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ రెండు పట్టణాల్లోని వ్యాపారులు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా తమ ఆదాయాలకు గండిపడ్డప్పటికీ ప్రజల ప్రణాలకంటే ఏదీ ఎక్కువ కాదని అభిప్రాయపడ్డారు. వ్యాపారంలో కొంత నష్టం వచ్చినా భరించకతప్పదని వారు సూచించారు.