ఐదు రోజుల నుంచి చెట్టు మీదే మకాం!

by sudharani |
ఐదు రోజుల నుంచి చెట్టు మీదే మకాం!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లా బాంగ్డీ గ్రామానికి చెందిన ఏఢుగురు యువకులు గత ఐదు రోజులుగా మామిడి చెట్టు మీదే నివాసం ఉంటున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో భాగంగా వారు ఇలా చెట్టు మీదే వెదురు బొంగులతో పడకలు చేసుకుని, ప్లగు పోర్టులు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. వారి పడకలకు ప్లాస్టిక్ కవర్లతో ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్నారు. కేవలం బట్టలు ఉతుక్కోవడానికి, అన్నం తినడానికి మాత్రమే రోజులో మూడు సార్లు చెట్టు దిగి కిందకి వస్తున్నారు. అది కూడా మాస్కులు ధరించి కిందకి వస్తున్నారు.

చెన్నైకి వలస వెళ్లి లాక్‌డౌన్ కారణంగా సొంత ఇంటికి వచ్చిన ఈ ఏడుగురికి ఊర్లో నివాస వసతులు లేకపోవడం, వారిని పోలీసులు ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించడంతో గ్రామస్తులు చెట్టునే ఇళ్లుగా మార్చారు. వారి కారణంగా ఇతరులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో చెట్టు మీద నివసించడానికి అంగీకరించడానికి ఏడుగురు యువకుల్లో ఒకరైన బిజోయ్ సింగ్ లాయ అన్నాడు. ప్రస్తుతానికి వీరి ఆహార అవసరాలకు గ్రామస్థులు సాయం చేస్తున్నారని, త్వరలోనే వీరికి ఏదైనా ప్రభుత్వ భవనంలో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తామని గ్రామ పంచాయతీ సమితి అధ్యక్షుడు నీతాయ్ మోండల్ చెప్పారు.

Tags : COVID 19, Corona, Self Isolation, Mango tree, West Bengal

Advertisement

Next Story

Most Viewed