భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

by Sumithra |
Seizure of counterfeit seeds
X

దిశ, తుంగతుర్తి: అమాయక రైతులను మోసం చేస్తూ.. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాను తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ తుల శ్రీనివాస్ వివరాలు వెళ్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా గణపవరం మండలం చందులూరుకు చెందిన పెంట్యాల వీరాంజనేయులు హైదరాబాద్ కొంపెల్లిలో నివాసం ఉంటున్నాడు. మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన రైతులకు బీటీ-3 పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ అమాయక రైతులను ఆసరాగా చేసుకొని విక్రయిస్తున్నారని తెలిపారు. శనివారం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో సుమారు రూ.6 లక్షల విలువైన 413 కిలోల పత్తి విత్తనాలు, బైక్ స్వాధీనం చేశామని వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీ‌ఐ తెలిపారు.

Advertisement

Next Story