హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లో భారీగా నగదును పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ కారులో తరలిస్తున్న రూ.3.75 కోట్ల హవాలా సొమ్మును టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిలీప్, హరీశ్‌రామ్, అజిత్ సింగ్, రాథోఢ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీపీ అంజనీకుమార్… నగదు ఎవరిది, ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదాయపన్ను శాఖ విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు.

Advertisement